News February 13, 2025

వృద్ధ దంపతులు సూసైడ్.. కారణమిదే..!

image

ఖమ్మం బ్యాంక్ కాలనీలో <<15433998>>వృద్ధ దంపతులు సూ<<>>సైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కష్టపడి దాచుకున్న సొమ్ము అప్పుగా ఇస్తే.. తిరిగి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసినట్లు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. వైద్యానికి డబ్బులేక మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.

Similar News

News March 22, 2025

ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రతలు ఇలా..

image

ఖమ్మం జిల్లాలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొణిజర్ల(M) పెద్దగోపతి, ఖమ్మం ఖానాపురంలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. అటు సత్తుపల్లిలో 38.7, కల్లూరులో 38.6, వైరాలో 38.5, ముదిగొండలో 38.5, పెనుబల్లి 38.4, కారేపల్లిలో 37.9, ఏన్కూరులో 37.3, రఘునాథపాలెంలో 37.2, బోనకల్‌లో 36.7, కుసుమంచిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు.

News March 22, 2025

ఆకుల సేకరణకు వెళ్లి.. అనంత లోకాలకు..!

image

ఎటపాక మండలం చింతలపాడు గ్రామానికి చెందిన మడివి జ్యోతిలక్ష్మి(12) తునికి చెట్టు ఎక్కి ఆకుల సేకరణ చేస్తూ.. కింద పడి ఈనెల 17న గాయపడ్డారు. ఆమెను స్థానికులు లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.

News March 22, 2025

6గ్యారంటీలకు రూ.56 వేల కోట్లు: Dy.CM

image

BRS పాలనలో రాష్ట్ర GST వృద్ధి రేటు 8.54 శాతంగా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇది 12.3 శాతానికి పెరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.2.80 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఆరు గ్యారంటీల కోసం మాత్రమే రూ.56 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, బడ్జెట్‌ను సవరించి, నిజమైన లెక్కలనే ప్రజలకు వెల్లడించామన్నారు.

error: Content is protected !!