News April 19, 2024

వెంకటగిరిపై టీడీపీలో తర్జనభర్జన

image

వెంకటగిరి టీడీపీ అభ్యర్థి మార్పు విషయంలో ఆపార్టీ అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఈ సీటును మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆశించారు. అధిష్ఠానం మాత్రం ఆయన కుమార్తె లక్ష్మీసాయి ప్రియ వైపు మొగ్గుచూపింది. కానీ రామకృష్ణకు అనుకూలంగా సర్వే రిపోర్టులు ఉండటంతో తిరిగి ఆయన్నే అభ్యర్థిగా నిలబెట్టాలనే యోచనతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 7, 2025

నెల్లూరులో స్పా సెంటర్లపై దాడులు..10 మంది యువతుల అరెస్ట్

image

నెల్లూరు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగాపురం, జగదీశ్ నగర్ సెంటర్లో ఉన్న Unisex, VIP స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. ఐదుగురు యువతులతో పాటు ఒక విటుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు కృష్ణవేణితో పాటు, సుధీర్‌పై కేసులు నమోదు చేస్తామని సీఐ సాంబశివరావు తెలిపారు. వేదాయపాళెం నిప్పో సెంటర్ వద్ద ఓ స్పా సెంటర్‌పై దాడులు చేసి ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

News December 7, 2025

నెల్లూరు: సిమ్ కార్డుతో మోసాలు

image

ఇతరుల వద్ద ఫోన్ తీసుకొని సిమ్ కార్డులను మారుస్తూ, ఓటీపీల సాయంతో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. గతనెల 29న అందిన ఫిర్యాదు మేరకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో దర్యాప్తు సాగిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శేషయ్య ఓటీపీల సహాయంతో వచ్చిన డబ్బులను బెట్టింగ్ యాప్‌లకు వాడినట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఇతని వద్ద రూ.2,60,000 రికవరీ చేసినట్లు తెలిపారు.

News December 6, 2025

పెంచలకోనలో విశేష పూజలు

image

రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.