News June 4, 2024

వెంకటగిరిలో టీడీపీ లీడ్

image

వెంకటగిరిలో ఇప్పటి వరకు మొదటి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు కురుగొండ్ల రామకృష్ణకు 4,717 ఓట్లు వచ్చాయి. దీంతో సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి 274 ఓట్లతో వెనుకపడ్డారు.

Similar News

News November 8, 2024

NLR: రేపటి నుంచి ప్రత్యేక ఎన్నికల ప్రచారం

image

నెల్లూరు జిల్లాలో ఈనెల 9,10వ తేదీల్లో ప్రత్యేక ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలన్నారు. బూత్ లెవెల్ అధికారులు పాల్గొని ఫారం 7,8,9 అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొత్త ఓటర్ల నమోదు, సవరణలకు దరఖాస్తుల స్వీకరించాలన్నారు.

News November 8, 2024

రాష్ట్రస్థాయిలో అదరగొట్టిన నెల్లూరు కుర్రాడు

image

నర్సరావుపేటలో ఈ నెల 5 నుంచి 7 వ తేదీ వరకు జరిగిన 68వ SGFI స్టేట్ లెవల్ ఇంటర్ స్విమ్మింగ్ పోటీల్లో నెల్లూరు జిల్లా సీతారామపురానికి చెందిన మణికంఠ సత్తా చాటాడు. మణికంఠ రాష్ట్రా స్థాయి స్కూల్ గేమ్స్‌లో 50 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ అండర్-17 విభాగంలో సిల్వర్ మెడల్,  100, 200 విభాగాల్లో మూడో స్థానంతో మొత్తం 3 పతకాలను సాధించాడు. దీంతో అతడిని పలువురు అభినందించారు. 

News November 8, 2024

లా పరీక్షా కేంద్రాన్ని వైస్ ఛాన్సలర్ ఆకస్మిక తనిఖీ

image

వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో నెల్లూరు నగరంలో ఉన్న వీఆర్ ఐ.ఏ.ఎస్ కళాశాలలో గురువారం జరిగిన ‘లా’ మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా వీఆర్ ఐ.ఎ.ఎస్ కళాశాలలో ఏర్పాటుచేసినా ‘లా’ పరిక్షకేంద్రాన్ని, వసతులను ఆయన పరిశీలించారు.