News May 20, 2024

వెంకటగిరి ఓటరు ఎటో..?

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరిగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ ఈ సారి వెంకటగిరి పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. వాళ్లు ఎక్కువా. మేం తక్కువా అని గ్రామీణ ప్రాంతాల్లో చర్చ సైతం రేగింది. ఈక్రమంలో అభ్యర్థులు ప్రత్యేకంగా చూసుకున్న పట్టణ ఓటర్లు ఎవరికి అండగా నిలిచారో..?

Similar News

News October 20, 2025

కావలి: మాలేపాటి సుబ్బానాయుడు మృతి

image

ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి చెందారు. బ్రెయిన్ స్టోక్‌తో గత 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాలేపాటి ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. శనివారం రాత్రి మాలేపాటి అన్న కుమారుడు బాను గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అంతక్రియలు ఇవాళ దగదర్తిలో నిర్వహించనున్నారు. మాలేపాటి మరణ వార్తతో ఆ కుటుంబం శోకసముద్రం మునిగిపోయింది.

News October 20, 2025

భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి : కలెక్టర్

image

జిల్లాలో ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించిన నేపథ్యంలో భారీ వర్షాలు పడుతున్నాయని, ఇంకా కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో సూచించారు. తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదనీ, వెళ్లినా వెంటనే వచ్చేయాలని సూచించారు.

News October 19, 2025

నెల్లూరు: చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు ఎప్పుడు..?

image

చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తామంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 100 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. దీంతో చేనేతలు కరెంట్ బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 7 వేల చేనేత కుటుంబాలు ఉన్నాయి. చేనేత కార్మికులకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ జీవో విడుదలైంది కానీ అది ఇంతవరకు ఆచరణలోకి రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.