News August 9, 2024

వెంకటగిరి: చనిపోయిన భార్య శిలా విగ్రహాన్ని చేయించి పూజించిన భర్త

image

చనిపోయిన భార్యపై ప్రేమను భర్త వినూత్నంగా చాటుకున్నారు. వెంకటగిరికి చెందిన భక్తకవి పెనగలూరి కుమార్ భార్య భూషణమ్మ గతేడాది మరణించారు. దీంతో భార్య జ్ఞాపకార్థం ఆమె సంవత్సరికం సందర్భంగా శిలా విగ్రహాన్ని తన స్వగృహంలో ప్రతిష్ఠించి పూజలు చేశారు. భార్యపై తనకున్న ప్రేమ అమూల్యమైనదని చాటి చెప్పారు.

Similar News

News December 3, 2025

నెల్లూరులో టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏది: లోక్ సభలో వేమిరెడ్డి

image

నెల్లూరు జిల్లాలో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేసిందనేది వాస్తవమేనా అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి లోక్ సభలో మంగళవారం ప్రశ్నించారు. ప్రాజెక్టు వ్యయం రూ.103 కోట్లతో 10 యూనిట్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఏమయ్యాయని అడిగారు. దీనికి కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరెట్ సమాధానమిస్తూ ప్రభుత్వం 2015లో ప్రకటించిందని, త్వరలో పూర్తి చేస్తామని, రూ.20 కోట్లు విడుదల చేశామని తెలిపారు.

News December 3, 2025

వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

image

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్‌లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.