News June 7, 2024
వెంకటగిరి చరిత్రతో ఒకే ఒక్కరు..!

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ గెలిచిన విషయం తెలిసిందే. వెంకటగిరిలో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వాళ్లలో కురుగొండ్ల ఒక్కరే వెంకటగిరి నియోజవర్గ చరిత్రలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా నిలిచారు. నేదురమల్లి రాజ్యలక్ష్మి రెండు సార్లు విజయం సాధించగా.. మిగిలిన ఎవరూ తిరిగి ఇక్కడి నుంచి రెండోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు.
Similar News
News December 1, 2025
నెల్లూరు: కుమారుడిని చంపిన తండ్రి

ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడులో సోమవారం జరిగింది. స్థానిక దళితవాడకు చెందిన మామిడూరు పుల్లయ్యకు ఇవాళ ఉదయం పింఛన్ డబ్బులు వచ్చాయి. ఆ నగదు తనకు ఇవ్వాలని కుమారుడు మస్తానయ్య(33) తన తండ్రితో గొడవకు దిగాడు. ఈక్రమంలో తన చేతిలోని కర్రతో పుల్లయ్య కుమారుడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మస్తానయ్య అక్కడికక్కడే చనిపోయాడు.
News December 1, 2025
నెల్లూరు నిమ్మకు తగ్గిన డిమాండ్

నిమ్మకు డిమాండ్ తగ్గిపోయింది. పొదలకూరు నుంచి ఉత్తరాది ప్రాంతాలకు నిమ్మ ఎగుమతి అవుతుంటుంది. అక్కడ అవసరాలు తగ్గిపోవడంతో నిమ్మకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది. బస్తా రూ.300 నుంచి రూ.600 పలుకుతుండటంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోకు పది రూపాయలు కూడా లభించడం లేదు. పొదలకూరు మండల వ్యాప్తంగా 5వేల ఎకరాలలో నిమ్మ సాగు అవుతుండగా.. దీని మీద సుమారు 2వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు.
News December 1, 2025
వేమిరెడ్డి గారూ.. వీటి గురించి మాట్లాడండి!

నెల్లూరు జిల్లాలో నాట్లు మొదలయ్యాయి. 6లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. ప్రభుత్వం ఎకరాకు 3బస్తాల యూరియానే ఇస్తానంటోంది. ఇటీవల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్లు విస్తరించాల్సిన అవసరం ఉంది. రైల్వే లైన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాల్సి ఉంది. గంజాయి నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వీటిపై MP వేమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఉంది.


