News April 2, 2024
వెంకటగిరి: పింఛన్ కోసం వచ్చి వృద్ధుడు మృతి

తనకు రావాల్సిన పింఛను కోసం తిరుపతి నుంచి వెంకటగిరిలోని బంగారు పేటకు 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య వచ్చాడు. పింఛన్ విషయం కనుక్కునేందుకు ఎండలో సచివాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News October 21, 2025
VSUలో కరెంట్ కట్.. విద్యార్థులకు సెలవు

కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ(VSU) గర్ల్స్ హాస్టల్లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వర్సిటీ అధికారులు స్పందించి ఆడిటోరియం, ఏయూ బిల్డింగ్ ఇతర ప్రాంతాల్లో వసతి కల్పించారు. కరెంట్ లేకపోవడంతో మంగళవారం సెలవు ప్రకటించారు. ఇవాళ ఉదయం మెకానిక్లను పిలిపించి సరఫరా పునరుద్ధరించారు. జనరేటర్ లేకపోవడంపై విమర్శలు వచ్చాయి.
News October 21, 2025
సోమశిలకు ఎలాంటి ప్రమాదం లేదు: సీఈ

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు. జలాశయం నిండిన తర్వాత ఒకేసారి నీటిని విడుదల చేయకుండా.. ముందస్తు ప్రణాళికలో భాగంగా కొంతమేర నీటిని విడుదల చేస్తామని సీఈ వరప్రసాద్ వెల్లడించారు. అవసరాన్ని బట్టి నీటి విడుదల ఉంటుందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 71 టీఎంసీల నీరు ఉండగా.. ప్రాజెక్టుకు ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
News October 21, 2025
నెల్లూరులో అమరవీరులకు నివాళి

పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని నెల్లూరులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితా వేజెండ్ల, పోలీస్ అధికారులు ఘన నివాళులర్పించారు. జోరు వానలోనూ కవాతు నిర్వహించారు. అంకితభావంతో పనిచేస్తూ అమరత్వం పొందిన పోలీసులను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని పలువురు పేర్కొన్నారు.