News August 16, 2024
వెంకటచలం: లవంగంపై సూక్ష్మ జాతీయ జెండా
ఆగస్టు 15 సందర్భంగా లవంగంపై అతి సూక్ష్మ సైజులో జాతీయ జెండాను రూపొందించి మండలంలోని యాచవరం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆలూరు రాము ఆచారి బుధవారం అందరినీ అబ్బుర పరిచారు. లవంగంపై చిన్న సైజు కర్ర పుల్లను తయారుచేసి పేపర్ పై సూక్ష్మ సైజులో జాతీయ జెండాను తయారుచేసి గ్రామంలో ప్రదర్శించారు. పలువురు రాము ప్రతిభను అభినందించారు.
Similar News
News January 16, 2025
ఆ ఇద్దరూ వీఆర్ లా కళాశాల విద్యార్థులే
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా యడవల్లి లక్ష్మణరావు, హరిహరనాథ శర్మల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులు నెల్లూరులోని వీఆర్ లా కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించారు. కర్నూలుకు చెందిన హరిహరనాథశర్మ న్యాయవాదిగా అక్కడే ప్రాక్టీస్ చేయగా, ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన లక్ష్మణరావు సొంత జిల్లాతో పాటు నెల్లూరు, కావలిలోనూ ప్రాక్టీస్ చేశారు.
News January 16, 2025
నెల్లూరు: రూ.21 కోట్ల మద్యం తాగేశారు
సంక్రాంతి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలో మద్యం ఏరులై పారింది. కేవలం ఐదు రోజుల్లో రూ.21 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. ముఖ్యంగా భోగి, కనుమ పండగ రోజుల్లో మద్యం దుకాణాల వద్ద తీవ్రమైన రద్దీ ఏర్పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం ప్రియులు దుకాణాల వద్ద బారులుతీరి కనిపించారు. ప్రధాన బ్రాండ్ల మద్యం స్టాక్ అయిపోయినా ఏది ఉంటే అదే కొనుగోలు చేశారు.
News January 16, 2025
ఉదయగిరిలో జోరుగా కోడిపందేలు
సంక్రాంతి పండగ సందర్భంగా ఉదయగిరి మండలంలోని పలు గ్రామాల్లో జోరుగా కోడిపందేలు జరుగుతున్నాయి. పోలీసు అధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ బేఖాతర్ చేస్తూ కోడిపందేలు నిర్వహించారు. మండలంలోని జి. చెరువుపల్లి, జి చెర్లోపల్లి, వెంకట్రావుపల్లి, కృష్ణంపల్లి పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన కోడిపందేలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.