News May 29, 2024

వెంకటాచలం: అటువైపు వెళ్లే వారు జాగ్రత్త

image

తిక్కవరప్పాడు-కంటేపల్లి మార్గంలో తిక్కవరప్పాడు బ్రాంచ్ కెనాల్‌పై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నిత్యం పలు గ్రామాల రైతులు, ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. అయితే ఈ మార్గంలో నిర్మించిన కల్వర్టు శిథిలమై సగంపైగా కూలిపోవడంతో బైకులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. అదుపుతప్పితే ప్రమాదం జరిగేలా ఉంది. సంబంధిత అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News January 21, 2025

నెల్లూరులో ఇద్దరు సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు

image

నెల్లూరు జిల్లాలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను, నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసిన ఇద్దరు సర్పంచ్‌లపై కలెక్టర్ ఓ ఆనంద్ చర్యలు చేపట్టారు. కొడవలూరు మండలం పెమ్మారెడ్డి పాలెం పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, గతంలో పనిచేసిన మధుసూదన్, రేగడిచెలిక పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్‌లను సస్పెండ్ చేశారు. రేగడిచెలిక, పెమ్మారెడ్డి పాలెం సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేశారు.

News January 21, 2025

జేఈఈ మెయిన్స్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ఈ నెల 22వ తేదీ నుంచి జరిగే JEE మెయిన్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ తెలిపారు. కోవూరు మండలం గంగవరంలోని గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్& టెక్నాలజీ, పొట్టేపాలెం ఇయాన్ డిజిటల్ జోన్, తిరుపతి జిల్లా కోటలోని NBKR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలలో పరీక్షలు జరుగుతాయన్నారు.

News January 21, 2025

పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి: కమిషనర్

image

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని, బకాయిలు చెల్లించని వారి కనెక్షన్లను వెంటనే తొలగించాలని వార్డు సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులను కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. కార్పోరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, టిడ్కో,హౌసింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు, అధికారులతో సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.