News March 19, 2025

వెంకటాపురం: కూలీలు కొరత.. రైతు ఆత్మహత్య

image

మిర్చి ఏరెందుకు కూలీలు దొరకక కాయలు ఎండుతుండటంతో ఓ రైతు మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై తిరుపతిరావు వివరాలు.. వెంకటాపురంకు చెందిన సతీశ్ 3 ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. గత 2 వారాలుగా కూలీలు దొరకడం లేదని భయంతో మనస్థాపం చెందాడు. మద్యం మత్తులో పురుగుమందు తాగగా కుటుంబీకులు వెంకటాపురం ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం హన్మకొండ తరలించారు. కాగా, చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడన్నారు.

Similar News

News December 9, 2025

భారత్ రైస్‌పై US టారిఫ్స్.. ఎవరికి నష్టం?

image

భారత్ రైస్‌పై US <<18509981>>టారిఫ్స్<<>>(ప్రస్తుతం 40%) పెంచితే మనం కంగారుపడాల్సిన అవసరంలేదని వాణిజ్య నిపుణులు అంటున్నారు. ‘2024-25లో ఇండియా $337.10 మిలియన్ల బాస్మతి రైస్‌, $54.64 మిలియన్ల నాన్-బాస్మతి రైస్‌ ఎగుమతి చేసింది. IND బాస్మతిలో ఉండే రిచ్ అరోమా, టెక్స్‌చర్, టేస్ట్‌ US రైస్‌లో ఉండదు. సుంకాల భారం వినియోగదారుల మీదే పడుతుంది. ఇతర దేశాల్లోనూ మన రైస్‌కు డిమాండ్, మార్కెట్ పెరుగుతోంది’ అని చెబుతున్నారు.

News December 9, 2025

ఉంగుటూరులో ఈనెల 11న మెగా జాబ్ మేళా

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఈ నెల11న జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు.

News December 9, 2025

క్వార్టర్ మందు.. చికెన్ బిర్యానీ!

image

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగియనుండటంతో గ్రామాల్లో ప్రలోభాల పర్వం జోరందుకుంది. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఓటుకు రూ.1000-4000 వరకు ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో చికెన్ బిర్యానీ, క్వార్టర్, కూల్‌డ్రింక్స్ పంచుతున్నారు. మరికొన్ని చోట్ల ఇంటికి కేజీ కోడికూర పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? COMMENT