News March 24, 2025

వెంకటాపురం: లారీ ఢీకొని ఒకరు మృతి

image

వెంకటాపురంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఉప్పెడు వీరాపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు వీరాపురం గ్రామానికి చెందిన గోపాల్‌గా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News December 10, 2025

తూ.గో: గ్రామీణ రహదారుల మరమ్మతులకు భారీగా నిధులు

image

గ్రామీణ రహదారుల మరమ్మతులు, నిర్మాణాల కోసం ఏపీఆర్‌ఎస్‌పీ పథకం కింద ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఏకంగా రూ.363.33 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 57 పనులకు రూ.72.39 కోట్లు, కోనసీమ జిల్లాలో 78 పనులకు రూ.130.79 కోట్లు, కాకినాడ జిల్లాలో 106 పనులకు రూ.160.15 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు.

News December 10, 2025

నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ముచ్చట్లు

image

పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నిన్నటితో తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో 29 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 155 స్థానాలకు 466 మంది పోటీలో నిలిచారు. రెండో దశ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. 19 గ్రామాలు ఏకగ్రీవం కాగా 146 స్థానాలకు 548 మంది బరిలో ఉన్నారు. గుర్తులు కేటాయించడంతో ప్రచార పర్వం మొదలైంది.

News December 10, 2025

VKB: ఓటేయడానికి ఇవీ తీసుకెళ్లండి !

image

ఓటర్లు తమ గుర్తింపు కోసం EPIC కార్డు (ఓటర్ ఐడీ) లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన ఈ క్రింది 18 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకటి చూపించవచ్చు. ​ఆధార్ కార్డు, ​పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ​పాన్ కార్డు, ​బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్(ఫొటోతో), ​రేషన్ కార్డు(ఫొటోతో), ​పట్టాదారు పాస్‌బుక్, ​ఉపాధి జాబ్ కార్డు, ​దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం(ఫొటోతో), ​పెన్షన్ తదితర పత్రాల్లో మొదలగునవి చూపించాలి.