News March 13, 2025
వెంకటాపూర్: Way2Newsకు స్పందన

“రామప్ప ప్రధాన కాలువకు బుంగ ” శీర్షికన ఈనెల 10న Way2Newsలో ప్రచురితమైన కథనానికి ములుగు జిల్లా నీటిపారుల శాఖ అధికారులు స్పందించారు. వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ప్రధాన కాలువ ఐన ఒగరు కాలువ గండిని బుధవారం పూడ్చివేశారు. అనంతరం ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 28, 2025
వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.
News November 28, 2025
రాజన్న ఆలయంలో అద్దాల మండపం తొలగింపు పూర్తి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో అద్దాల మండపం (స్వామివారి కళ్యాణమండపం) తొలగింపు పూర్తయింది. ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులలో భాగంగా ఆలయ పరిసరాల్లో ఫ్లోరింగ్ పూర్తిగా తొలగించారు. అద్దాల మండపం తొలగించి శిథిలాలు తరలించారు. ఉత్తరం వైపు ప్రాకారం పూర్తిగా తీసివేయడంతో పాటు బాల రాజేశ్వర ఆలయ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని తొలగించారు. ధర్మగుండం రెండు వైపులా ప్రాకారం కూల్చివేశారు.
News November 28, 2025
రేపు వరంగల్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి శనివారం వరంగల్ పర్యటనకు రానున్నారు. ఆయన భద్రకాళీ, వెయ్యి స్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను సందర్శిస్తారు. కాజీపేట, అయోధ్యపురంలోని రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కూడా ఆయన సందర్శించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తెలిపారు.


