News May 19, 2024
వెంకన్నపాలెంలో యువకుడి మృతదేహం లభ్యం
చోడవరం మండలం వెంకన్నపాలెం సమీపంలో ఆదివారం సాయంత్రం యువకుడి మృతదేహం లభ్యమయింది. బుచ్చయ్యపేట మండలం వడ్డాదికి చెందిన గనిశెట్టి నానాజీగా కుటుంబ సభ్యులు గుర్తించారు. నానాజీ ఈనెల 14న మిస్ అయినట్లు కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా ఉరి వేసుకుని మృతదేహంగా లభ్యమవడం కుటుంబ సభ్యులను విషాదంలో నింపింది. చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 4, 2024
విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ స్పెషల్ రైళ్లు
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ చెన్నై ఎగ్మోర్ స్పెషల్ ట్రైన్ ఈనెల 7 నుంచి వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ వరకు ప్రతి శనివారం నడుపుతున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖకు ఈనెల 8 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుందన్నారు.
News December 4, 2024
సింహాచలంలో డిసెంబర్‌లో జరిగే ముఖ్య ఉత్సవాలు
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో 2024 డిసెంబర్ నెలలో నిర్వహించబోయే ఉత్సవాలను అధికారులు వెల్లడించారు.11న స్వర్ణ తులసీదళార్చనం, గీతాజయంతి, గ్రామ తిరువీధి, 12న స్వర్ణ పుష్పార్చనం, నృసింహ దీక్ష ప్రారంభం. 13నశ్రీ తాయార్ సన్నిధిని సహస్రనామార్చనం, కృత్తిక, తిరుమంగైయాళ్వార్ తిరునక్షత్రం,14న శ్రీ స్వామివారి మాస జయంతి16న నెలగంటు జయంతి కార్యక్రమాల నిర్వహించనున్నారు.
News December 4, 2024
విశాఖ: ప్రమాదవశాత్తు గాయపడ్డ అంగన్వాడీ టీచర్
విశాఖలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కయ్యపాలెంలోని 43వ వార్డు శ్రీనివాసనగర్‌లో అంగన్వాడీ టీచర్ రహీమున్నీసా బేగం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో గాయపడింది. స్థానికులు సమాచారం మేరకు 4వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.