News June 23, 2024

వెంకయ్యను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

image

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ వెంకయ్య నాయుడిని కలిశారు. ఈ మేరకు ఆదివారం ఆయన్ను ఢిల్లీలో కలిసినట్లు ఎంపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ పుష్పగుచ్ఛం అందజేశారు.

Similar News

News November 8, 2024

ఇంటి వద్దే ఈకేవైసీ నమోదు: నిధిమీనా

image

ఉచిత గ్యాస్ సిలిండర్‌కు అర్హులైన వినియోగదారులకు వారి ఇంటి వద్దే గ్యాస్ డెలివరీ బాయ్స్‌చే ఈకేవైసీ నమోదు చేసుకునే సదుపాయం ఉందని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి బియ్యం కార్డు, గ్యాస్ కనెక్షన్, అధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు అర్హులన్నారు. వినియోగదారులు తమ మొదటి ఉచిత సిలిండర్‌ను గ్యాస్ ఏజెన్సీలో మార్చిలోపు బుక్ చేసుకోవచ్చన్నారు.

News November 8, 2024

కృష్ణానదిలో యువకుడి మృతదేహం లభ్యం

image

పెనుమూడి బ్రిడ్జిపై యువకుడు అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. 2 రోజుల గాలింపు అనంతరం అతని మృతదేహం లభ్యమైంది. చల్లపల్లి నిమ్మలతోటకు చెందిన సుమంత్ బుధవారం సాయంత్రం కృష్ణానదిపై ఉన్న పెనుమూడి బ్రిడ్జిపై బైక్, మొబైల్, పర్స్ పెట్టి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చల్లపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం అవనిగడ్డ మండలం తుంగలవారిపాలెం వద్ద కృష్ణానదిలో అతని మృతదేహం లభ్యమైంది.

News November 8, 2024

‘ఈ అమ్మవారిని కదంబ పుష్పాలతో పూజిస్తారు’

image

మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలోని భ్రమరాంబికా అమ్మవారిని భక్తులు ప్రతి శుక్రవారం కదంబ పుష్పాలు, ఆకులతో పూజిస్తారు. ఈ ఆలయంలో శ్రావణ, కార్తిక మాసంలో ప్రతిరోజు దీపాలు వెలిగిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని, కొత్త వాహనాలకు పూజలు చేయిస్తే వాటికి ఆపద రాదని భక్తులు చెబుతున్నారు. చిన్న పిల్లలను ఆలయంలోని ఉయ్యాలలో వేస్తే సుఖంగా ఉంటారని ఇక్కడి ప్రజల నమ్మకం. ప్రతి శుక్రవారం ఇక్కడ భక్తులకు అన్న సంతర్పణ చేస్తారు.