News February 25, 2025
వెంకోజిపాలెంలో దారుణ హత్య

విశాఖ నగరంలోని రామ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. ఏపీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకోజి పాలెం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. రాత్రి 12 గంటల తర్వాత ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు, క్లూస్ టీం చేరుకున్నారు. ఏసీపీ అన్నెపు నర్సింహామూర్తి, సీఐ మురళి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2025
విశాఖ: 123 పోలింగ్ కేంద్రాలు.. 22,493 మంది ఓటర్లు

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారి హరేంద్ర ప్రసాద్ తెలిపారు. 123 పోలింగ్ కేంద్రాలలో 22,493 మంది టీచర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్ విధిస్తామన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 739 మంది అధికారులను, సిబ్బందిని కేటాయించామన్నారు. 148 మంది పీవోలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News February 25, 2025
విశాఖలో మూతపడిన మద్యం షాపులు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విశాఖలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎక్సైజ్ అధికారులు ప్రతి మద్యం దుకాణం వద్దకు చేరుకొని సీల్డ్ వేసి తాళాలు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో మళ్లీ 27 సాయంత్రం 4 గంటల తర్వాత మద్యం షాపులు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు.
News February 25, 2025
వైసీపీ పాలనలో ఉపాధ్యాయులకు అవమానం: గంటా

గత వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పెట్టి అవమానించిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ గెలిపించాలన్నారు. పదవిని కాపాడుకోవడానికే జగన్ అసెంబ్లీకి వచ్చారని, తాము గేట్లు తెరిస్తే వైసీపీ నుంచి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు.