News February 22, 2025
వెంకోజిపాలెం వైపు ట్రాఫిక్ డైవర్షన్

విశాఖలో ఇసుకతోట జాతీయ రహదారిపై గ్రూప్-2 అభ్యర్థులు శనివారం ధర్నాకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపడుతున్నారు. కొన్ని వాహనాలను వెంకోజిపాలెం మీదుగా ఎంవీపీ కాలనీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు దారి మళ్ళించారు. మరికొన్ని వాహనాలను హెచ్బి కాలనీ మీదుగా సీతమ్మధార వైపు దారి మళ్ళించారు.
Similar News
News November 22, 2025
తాటిచెట్లపాలెం: బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి

తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని శనివారం రాత్రి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు చక్రాల కింద పడటంతో తల నుజ్జునుజ్జయింది. మృతుడి వయస్సు 70 సంవత్సరాలు వయసు పైబడి ఉంటుంది. ఫోర్త్ టౌన్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని వివరాలు ఆరా తీస్తున్నారు.

విశాఖలో కాంగ్రెస్ ప్రక్షాళన: డీసీసీ ఎన్నికలకు సన్నాహాలు

విశాఖలో డీసీసీ అధ్యక్షురాలు హాసిని వర్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు హాజరయ్యారు. అధిష్టానం జిల్లాకో పరిశీలకుడిని నియమించిందని, త్వరలో డీసీసీ ఎన్నికలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను కమిటీలకే అప్పగిస్తామని తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చి, రాబోయే ఎన్నికల్లో జీవీఎంసీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ధీమా వ్యక్తం చేశారు.