News February 22, 2025
వెంకోజిపాలెం వైపు ట్రాఫిక్ డైవర్షన్

విశాఖలో ఇసుకతోట జాతీయ రహదారిపై గ్రూప్-2 అభ్యర్థులు శనివారం ధర్నాకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపడుతున్నారు. కొన్ని వాహనాలను వెంకోజిపాలెం మీదుగా ఎంవీపీ కాలనీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు దారి మళ్ళించారు. మరికొన్ని వాహనాలను హెచ్‌బి కాలనీ మీదుగా సీతమ్మధార వైపు దారి మళ్ళించారు.
Similar News
News March 25, 2025
విశాఖలో 50% వడ్డీ పై రాయితీ: కలెక్టర్

జీవీఎంసీ పరిధిలో గృహ యజమానులు, ఆస్తిపన్ను చెల్లింపుదారులు మార్చి 31లోపు ఆస్తి పన్ను చెల్లిస్తే 50శాతం వడ్డీ పై రాయితీ మినహాయింపును పొందవచ్చని కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఎంఎన్ హరింధిర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగర ప్రజలు సౌకర్యార్థం, ప్రతీ వార్డు సచివాలయంలో ఆస్తిపన్ను బకాయిలను చెల్లించవచ్చు అన్నారు. మార్చి 30 ఆదివారం కూడా జోనల్ కార్యాలయాల్లో కేంద్రాలు పనిచేస్తాయన్నారు.
News March 25, 2025
డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖ జిల్లాలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ & రీసెర్చ్ సెంటర్లు, రీజినల్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు ఉప రవాణా కమీషనర్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రవాణా శాఖ మార్గదర్శకాల ప్రకారం అర్హతగల సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ www.morth.nic.in లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
News March 25, 2025
విశాఖ : ఈ స్థానాలలో రిపోర్టర్లు కావలెను..!

విశాఖ నగరం కార్ షెడ్ , కొమ్మాది, రుషికొండ, సింహాచలం, దువ్వాడ, కూర్మన్నపాలెం, పాత గాజువాక, షీలానగర్, మర్రిపాలెం, ద్వారకానగర్ స్థానాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <