News April 16, 2025

వెంటనే నివేదికలు పంపండి: నాగర్‌కర్నూల్ ఎంపీ 

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల నివేదికలను వెంటనే పంపాలని ఎంపీ డాక్టర్ మల్లురవి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలాల తహశీల్దార్లు మామిడి, వరి, ఇతర పంటలను నష్ట పోయిన రైతుల వివరాలను కలెక్టరేట్‌లో అందివ్వాలని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తోందని, రైతులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.

Similar News

News April 16, 2025

పెద్దపల్లి: ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

పెద్దపల్లి జిల్లాలో యాసంగి పంట ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. నాణ్యమైన పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామన్నారు. సన్న రకం ధాన్యానికి క్వింటాల్ రూ.500 బోనస్ సైతం అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు అంశంలో ఎలాంటి ఫిర్యాదులు, సమస్యలు ఉన్న 7995050780, 08728-224045 కాల్ చేయాలన్నారు.

News April 16, 2025

Caratlane ఫ్రాంచైజీతో జ్యువెల్లరీ రంగంలోకి ‘కమల్ వాచ్’

image

కమల్ వాచ్ కంపనీ జ్యువెల్లరీ రంగంలో అడుగుపెడుతూ హైదారాబాద్ గచ్చిబౌలిలో మొదటి Caratlane ఫ్రాంచైజీని టోట్ల ఫ్యామిలీతో కలిసి ప్రేమలతా భాయ్ టోట్ల ప్రారంభించారు. గచ్చిబౌలిలో గూగుల్ కార్యాలయం ఎదురుగా ఈ మొట్టమొదటి నూతన షోరూమ్‌ను కమల్ వాచ్ ఏర్పాటు చేసింది. ఐదు రాష్ట్రాలలో 56 వాచ్ స్టోర్లు, Swarovski అవుట్‌లెట్లు మరియు లగేజ్ స్టోర్లతో పాటు ఈ కొత్త ప్రారంభంతో తమ వ్యాపారంలో వైవిధ్యతను ప్రకటించారు.

News April 16, 2025

మహబూబ్‌నగర్: ‘ప్రతి కేసును పారదర్శకంగా విచారణ చేపట్టాలి’

image

పోలీసులు ప్రతి కేసును కూడా పారదర్శకంగా విచారణ చేపట్టాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సర్కిళ్ల  వారీగా నమోదైన నేరాల విషయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిందితులకు శిక్ష శాతాన్ని పెంచేందుకు పగడ్బందీగా విచారణ చేపట్టాలన్నారు. విచారణ జరగకుండా నిలిచిపోయిన కేసుల గురించి ఎస్పీ ఆరా తీసి కారణాలు అడిగి తెలుసుకున్నారు.

error: Content is protected !!