News October 1, 2024
వెదురుకుప్పం: బొమ్మయపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు
వెదురుకుప్పం మండలంలోని బొమ్మయ్యపల్లి సర్పంచి గోవిందయ్య చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం అయినట్లు దేవళంపేట వార్డు సభ్యుడు పయని డీపీవో, కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి.. నిధులు దుర్వినియోగమైనట్టు నిర్ధారణ కావడంతో చెక్ పవర్ రద్దు చేసినట్టు అందులో పేర్కొన్నారు.
Similar News
News October 11, 2024
ఏర్పేడు: Ph.D ప్రవేశాలకు దరఖాస్తులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో 2024-25 విద్యా సంవత్సరానికి Ph.Dలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. బయాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎర్త్ & క్లైమేట్ సైన్స్, హ్యుమానిటీస్& సోషల్ సైన్స్ విభాగాలలో అవకాశాలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. చివరి తేదీ నవంబర్ 03.
News October 11, 2024
నేను తిరుమలలో తప్పు చేయలేదు: మాధురి
చేయని తప్పుకు తాను క్షమాపణ చెప్పనని దివ్వెల మాధురి అన్నారు. తిరుమల పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయడంతో స్పందించారు. ‘తిరుమలలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. దువ్వాడ గారితో చాలా మంది కార్యకర్తలు తిరుమలకు వెళ్లారు. నేనూ కార్యకర్తలాగే ఆయన వెంట వెళ్లా’ అని మాధురి చెప్పారు. తాను కొండపై ఎలాంటి తప్పు చేయలేదని.. తెలిసీతెలియక తప్పు జరిగి ఉంటే క్షమాపణ చెబుతున్నా’ అని దువ్వాడ అన్నారు.
News October 11, 2024
దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై పెట్టిన కేసులు ఇవే..!
తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై తిరుమల DSP విజయశేఖర్ స్పందించారు. ‘తిరుమల మాఢ వీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం నిబంధనలకు విరుద్ధం. ఈవిషయమై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ వాళ్లు మాకు ఫిర్యాదు చేయడంతో BNS 293, 300 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. తిరుమలలో వ్యక్తిగత విషయాలు మాట్లాడకపోవడం మంచిది’ అని డీఎస్పీ సూచించారు.