News February 1, 2025
వెదురు వస్తువుల తయారీతో ఆర్థికాభివృద్ధి: అదనపు కలెక్టర్

వెదురు వస్తువుల తయారీతో సంఘాల ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆసిఫాబాద్ మండలం సాలెగూడలో నిర్మాణంలో ఉన్న వెదురు ప్రాసెసింగ్ యూనిట్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెదురుతో వినూత్న వస్తువులు తయారు చేసే ప్రణాళిక రూపొందించాలన్నారు. యూనిట్ పూర్తిచేసే లోపు అవసరమైన వెదురు నిల్వల సేకరణకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
Similar News
News February 19, 2025
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోకి నకిలీ పోలీస్

TG: కానిస్టేబుల్‌ని అంటూ ఓ వ్యక్తి పోలీస్ కమాండ్ కంట్రోల్‌లోకి ప్రవేశించాడు. గోవర్ధన్ అనే అతను కానిస్టేబుల్ అని చెప్పి జ్ఞాన సాయి ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.3లక్షలు తీసుకున్నాడు. అతణ్ని నమ్మించడానికి CM సమీక్ష జరుగుతున్నప్పుడే CCCలోకి వెళ్లి వచ్చాడు. ఆపై అతను కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు CCTV ఫుటేజ్ పరిశీలించగా నిందితుడి చిత్రాలు నమోదయ్యాయి.
News February 19, 2025
మోదీని కలిసిన రిషి సునాక్ ఫ్యామిలీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ కుటుంబ సమేతంగా కలిశారు. వారి వెంట సునాక్ అత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా బ్రిటన్ మాజీ ప్రధాని ఫ్యామిలీతో కలిసి భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
News February 19, 2025
మెదక్: కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..?

ఉమ్మడిMDK- KNR- ADB- NZB, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.