News February 10, 2025

వెదురు సాగు చేసే రైతుల ఇంట సిరుల పంట: కొత్తగూడెం కలెక్టర్

image

వెదురు సాగు చేయడం వల్ల రైతుల ఇంట సిరుల పంట పడినట్టేనని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయం మినీ సమావేశ మందిరంలో ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చుండ్రుగొండ, ములకలపల్లి, గుండాల మండలాల ఏపీఎంలు, ఏపీవోలు, సీసీలు, ఎఫ్‌పీసీలు, వీవో ఏసీలు, అటవీ శాఖ సిబ్బందికి వెదురు పెంపకంపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

Similar News

News April 17, 2026

ఖమ్మం: పల్టీ కొట్టిన వరి కోత మిషన్.. డ్రైవర్ మృతి

image

కల్లూరు మండలం పెద్ద కోరుకొండి శివారులో వరి కోత మిషన్ ప్రమాదవశాత్తు పల్టీ కొట్టడంతో డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు గుర్తించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెప్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2026

పండ్లు తింటున్నారా? FSSAI వార్నింగ్!

image

మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్లను కృత్రిమంగా పండించేందుకు ‘మసాలా’ (కాల్షియం కార్బైడ్) వాడకంపై FSSAI కఠిన చర్యలు చేపట్టింది. ఈ రసాయనం వల్ల చర్మ వ్యాధులు, గొంతు సమస్యలు, వాంతులు వచ్చే ప్రమాదం ఉండటంతో తనిఖీలు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇథిలీన్ ద్రావణంలో పండ్లను ముంచడం కూడా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

News April 17, 2026

నంద్యాల జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

image

నంద్యాల జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 10,84,706 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పురుషులు 5,33,161 మంది, మహిళలు 5,51,420 మంది, ఇతరులు 125 మంది ఉన్నారు. నంద్యాల జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి.