News June 4, 2024
వెనుకంజలో జగన్ మేనమామ

కమలాపురంలో టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి, తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 8వ రౌండ్లో ఓట్లు ఇలా..
➢ చైతన్య రెడ్డి: 40562
➢ రవీంద్రనాథ్ రెడ్డి: 28244
➠ 8వ రౌండ్ ముగిసే సరికి పుట్టా చైతన్య రెడ్డి 12318 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
Similar News
News December 11, 2025
కడప కలెక్టర్కు 16వ ర్యాంకు

కడప కలెక్టర్గా శ్రీధర్ చెరుకూరి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక ఆయన 481 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 466 ఫైల్స్ క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్ను కేవలం 2 రోజుల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనకు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 16వ ర్యాంకు కేటాయించారు.
News December 11, 2025
యురేనియం బాధితులకు న్యాయం చేస్తాం: కలెక్టర్

తుమ్మలపల్లి యురేనియం గ్రామాల సమస్యలపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి బుధవారం సమీక్షించారు. కేకే కొట్టాల భూసేకరణకు ల్యాండ్ కమిటీ వేసి నోటిఫికేషన్ ఇస్తామని, ఇందుకు 6 నెలలు పడుతుందని తెలిపారు. పెండింగ్ ఉద్యోగాలు, పరిహారం వెంటనే క్లియర్ చేయాలని UCIL అధికారులను ఆదేశించారు. బాధితులకు సీఎస్ఆర్ ద్వారా వైద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్సీ బి.టెక్ రవి, గ్రామస్థులు పాల్గొన్నారు.
News December 10, 2025
కడప నగర నూతన YCP మేయర్ ఇతనే.!

కడప నగర నూతన మేయర్గా పాక సురేశ్ ఎన్నికయ్యారు. కాసేపటి క్రితం కడపలోని MP నివాసంలో జరిగిన సమావేశంలో YS అవినాశ్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా 47 డివిజన్ కార్పొరేటర్ పాక సురేశ్ పేరును వైసీపీ కార్పొరేటర్లు ఆమోదించారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన మేయర్గా పాక సురేశ్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


