News January 29, 2025

వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు: హోం మంత్రి అనిత

image

సంక్షేమ పథకాలు అమలులో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి పథకాన్ని అమలు చేస్తామన్నారు. కేంద్రం సహాయంతో ఆగిపోయిన రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్‌ని ట్రాక్‌లో పెట్టామన్నారు. గత ప్రభుత్వ అసమర్థ పాలనలో ఆర్థిక ఆరోగ్య సూచీలో ఏపీ అట్టడుగున నిలిచిందన్నారు.

Similar News

News December 4, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు HYD వ్యాప్తంగా ఫ్రీ బస్సులు

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌కు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 10 నుంచి 13 వరకు గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకునేందుకు MGBS, JBS, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్బీనగర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌కు వెళ్లేందుకు ఉ.9 నుంచి మ.1 వరకు, తిరిగి వచ్చేందుకు సా.4 నుంచి రాత్రి 9 వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి.

News December 4, 2025

ఏడాదిలో సరికొత్త టోల్ వ్యవస్థ: గడ్కరీ

image

ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థ ఏడాదిలోపే కనుమరుగవుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను అమలు చేస్తామని చెప్పారు. దీనివల్ల టోల్ పేరుతో NHలపై ఎక్కడా ఆగకుండా ప్రయాణించవచ్చన్నారు. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో అమలవుతోన్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.10 లక్షల కోట్లతో 4,500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని లోక్‌సభలో తెలిపారు.

News December 4, 2025

మునగాల: జీపీలో జాబ్ రిజైన్.. సర్పంచ్‌గా పోటీ

image

మునగాల మండలం వెంకట్రామపురం గ్రామ పంచాయతీ ఉద్యోగి మంద ముత్తయ్య తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వెంకట్రామపురం ఎస్సీ జనరల్ స్థానం కావడంతో, పోటీ చేసేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు రాజీనామాను ఆమోదించడంతో, ఆయన ప్రచారం ప్రారంభించారు. అధికార పార్టీ ముత్తయ్యకు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.