News February 5, 2025
వెనుకబడిన ఎన్ని జిల్లాలను కేంద్రం గుర్తించింది: ఖమ్మం ఎంపీ

విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు, విద్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్సభలో ప్రశ్నించారు. గత ఐదేళ్లలో విద్యాపరంగా వెనుకబడిన ఎన్ని జిల్లాలను గుర్తించారని, తాజా జనాభా లెక్కల ప్రకారం ఆయా జిల్లాల్లో SC, ST నిష్పత్తి ఏ విధంగా ఉందని అడిగారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి జయంత్ ఎంపీకి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
Similar News
News November 2, 2025
తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి యువకుడి మృతి.!

మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వీరేంద్ర తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నది ఉద్ధృతికి కొట్టుకుపోయి మరణించాడని స్థానికులు తెలిపారు. కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్థులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
News November 2, 2025
నూజివీడు రెవెన్యూ డివిజన్.. అటా..ఇటా..?

జిల్లాల విభజనతో ఏలూరు జిల్లాలో చేరిన నూజివీడు రెవెన్యూ డివిజన్లో మార్పులు జరిగే అవకాశముంది. ఎన్నికల వేళ చంద్రబాబు నూజివీడును కృష్ణా జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. నూజివీడు ప్రాంతం విజయవాడను ఆనుకుని ఉందని, తమ ప్రాంతాన్ని ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. నూజివీడును కృష్ణా లేదా ఎన్టీఆర్ జిల్లాలో చేర్చే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
News November 2, 2025
క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి?

క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమికి ముందు వస్తుంది. ఈరోజున విష్ణువు బృందావనంలోకి (తులసి కోటలోకి) అడుగుపెడతారు. అందుకే వ్రతం ఆచరించే వారు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మను ఉంచి పూజిస్తారు. తులసి కోటకు సమీపంలో విష్ణువు (లేదా) కృష్ణుడి ప్రతిమను ఉంచి పూజించడం శ్రేష్ఠం. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తే, ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి.


