News February 5, 2025
వెనుకబడిన ఎన్ని జిల్లాలను కేంద్రం గుర్తించింది: ఖమ్మం ఎంపీ

విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు, విద్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. గత ఐదేళ్లలో విద్యాపరంగా వెనుకబడిన ఎన్ని జిల్లాలను గుర్తించారని, తాజా జనాభా లెక్కల ప్రకారం ఆయా జిల్లాల్లో SC, ST నిష్పత్తి ఏ విధంగా ఉందని అడిగారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి జయంత్ ఎంపీకి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
Similar News
News February 9, 2025
ములుగు: గుప్పుమంటున్న గుడుంబా

కన్నాయిగూడెం మండలంలో గుడుంబా గుప్పుమంటుంది. పలు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో గుడుంబా విక్రయ, తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మారి అడ్డుకట్ట పడడం లేదన్నారు. బుట్టాయిగూడెంలోని ఓ ప్రాంతంలో గుడుంబా తాగి స్పృహ కోల్పోయి కాల్వలో పడిన ఓ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
News February 9, 2025
రోజుకు 2-3 గంటలే నిద్రపోతా: సల్మాన్ ఖాన్

తాను రోజుకు 2-3 గంటలే నిద్రపోతానని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తెలిపారు. నెలలో 2-3 సార్లు మాత్రమే 7-8 గంటలు నిద్రపోతానని తన తమ్ముడి కొడుకు అర్హాన్ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. ‘షూటింగ్ గ్యాప్‌లో కూడా చిన్న కునుకు తీస్తా. విమానం కుదుపులకు గురైనా హాయిగా నిద్రపోతా. జైలులో ఉన్నప్పుడు మాత్రం నిద్రకు ఎక్కువ సమయం కేటాయించా’ అని చెప్పుకొచ్చారు. కాగా సల్మాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమాలో నటిస్తున్నారు.
News February 9, 2025
జనగామ: వసతి గృహాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ రైల్వే ట్రాక్ పరిధిలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, రాత్రి అక్కడే బస చేయనున్నారు.