News February 18, 2025
వెనుకబడిన విద్యార్థులపై దృష్టిపెట్టండి: CMO

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని SSA జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సుబ్రహ్మణ్యం సూచించారు. పి.గన్నవరం మండలం మానేపల్లి బాలుర, బాలికల ZPH స్కూల్స్ను ఆయన సోమవారం సందర్శించారు. 10వ తరగతి ప్రిపబ్లిక్, భౌతిక శాస్త్రం పరీక్ష నిర్వహణ తీరు పరిశీలించారు. పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధతపై పలు సూచనలు చేశారు. ఏడు రివిజన్ టెస్టుల్లో సాధించిన ప్రగతిని పరిశీలించారు.
Similar News
News November 15, 2025
భూకంపాలను పసిగట్టే ప్రాచీన భారత టెక్నాలజీ

భూకంపాలను గుర్తించే సాంకేతికత ఇప్పటికీ ఆధునిక ప్రపంచానికి సవాలే. కానీ, వేల ఏళ్ల క్రితమే మన భారతీయ శాస్త్రాలు భూకంపాల పూర్వ సూచనలను చెప్పే గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాయి. సుమారు 1,500 సంవత్సరాల క్రితం వరాహమిహిరుడు రచించిన బృహత్సంహిత అనే గ్రంథంలో, భూకంపాలకు ముందు ప్రకృతిలో వచ్చే అసాధారణ వాతావరణ మార్పులను (పశుపక్ష్యాదుల ప్రవర్తన, భూగర్భ జలాల్లో మార్పులు) క్షుణ్ణంగా వివరించారు. <<-se>>#VedikVibes<<>>
News November 15, 2025
CII సదస్సు.. 13 లక్షల ఉద్యోగాలు: రాష్ట్ర ప్రభుత్వం

AP: సీఐఐ సదస్సులో తొలి రోజు 365 సంస్థలతో రూ.8,26,668 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సమ్మిట్ ముందు రోజుతో కలిపి 400 MoUలు, రూ.11,99,971 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని పేర్కొంది. దీంతో 13,32,445 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించింది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులు పెట్టుకున్న విశ్వాసాన్ని మరోసారి రుజువుచేసిందని తెలిపింది.
News November 15, 2025
పాఠశాలల్లో డ్రాపౌట్లు ఉండకూడదు: కలెక్టర్ సిరి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు డ్రాపౌట్లు కాకుండా చూడాలని, పిల్లలను వలసలకు తీసుకెళ్లే తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విద్యా శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డీఈఓ, ఎంఈఓలతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు.


