News February 6, 2025

వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిళ్లు ‘కొండవెలగాడ’

image

వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిల్లు కొండవెలగాడ తన పేరును సార్థకం చేసుకుంది. వల్లూరి శ్రీనివాసరావు, మత్స సంతోషి లాంటి సీనియర్ లిఫ్టర్లు ఈ గ్రామం నుంచే వెళ్లి కామన్ వెల్త్‌లో ఛాంపియన్స్‌గా నిలిచి దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో నిలిపారు. వాళ్లని ఆదర్శంగా తీసుకొని పదుల సంఖ్యలో క్రీడాకారులు గ్రామం నుంచి పుట్టుకొచ్చారు. తాజాగా జాతీయస్థాయిలో జరిగిన పోటీల్లో గ్రామానికి చెందిన శనపతి పల్లవి గోల్డ్ మెడల్ కొట్టింది.

Similar News

News February 6, 2025

VZM: ‘క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి’

image

క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారిణి జీవన రాణి సూచించారు. వైద్య శాఖ కార్యాలయంలో జిల్లాలో పీహెచ్సీ, సీహెచ్సీ వైద్యులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాతృ సేవలు, జేఎస్ వై, పీఎం మాతృ సురక్ష అభియాన్, తదితర కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శత శాతం ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

News February 6, 2025

మంత్రి కొండపల్లికి మూడో ర్యాంక్

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మూడో ర్యాంకు పొందారు.

News February 6, 2025

ఈనెల 10న డీ వార్మింగ్ డే: కలెక్టర్ అంబేడ్కర్

image

విజయనగరం జిల్లాలో గుర్ల మండలంలో తప్ప జిల్లా అంతటా ఈ నెల 10న డీ వార్మింగ్ డే సందర్భంగా అల్బెండజోల్ మాత్రలను సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష జరిపారు. గుర్ల మండలంలో బోదకాలుకు సంబంధించిన మాత్రలు వేస్తున్నందున నులిపురుగుల నివారణా మాత్రలు ప్రస్తుతం వేయడం లేదని తెలిపారు. 19 ఏళ్లలోపు ఉన్న వాళ్లంతా అల్పెండజోల్ మాత్రలు వేసుకోవాన్నారు.

error: Content is protected !!