News November 28, 2024
వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కడప జిల్లా అమ్మాయికి కాంస్య పతకం
వైవీయూ పరిధిలో గల కమలాపురంలోని సీఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్ఆర్ఎం డిగ్రీ, పీజీ కళాశాలలో బీఏ ఫస్టియర్ చదువుతున్న రేఖా మోని వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించారు. నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న దక్షిణ, పశ్చిమ భారత అంతర విశ్వవిద్యాలయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 45 కేజీల విభాగంలో ఈమె కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా ఆమెకు వైవీయూ వీసీ కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ పద్మ అభినందనలు తెలిపారు.
Similar News
News December 14, 2024
సావిశెట్టిపల్లె నీటి సంఘం అధ్యక్షుడిగా విజయ రెడ్డి
శ్రీ అవధూత కాశినాయన మండలంలోని సావిశెట్టి పల్లె ఆయకట్టు చెరువుకు సంబంధించి శనివారం నీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల అధికారి బాలి రెడ్డి తెలిపారు. నీటి సంఘం అధ్యక్షుడిగా విజయరెడ్డి, ఉపాధ్యక్షురాలిగా బండి సుబ్బ లక్ష్మమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, బండి రామచంద్రారెడ్డి, రఘురాంరెడ్డి వారిని అభినందించారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
News December 14, 2024
ఓబులవారిపల్లి: హత్య కేసు నిందితులు అరెస్ట్
ఓబులవారిపల్లి మండలం మంగంపేట 10వ వీధికి చెందిన గట్టు ఆంజనేయులు(57) హత్య కేసులో నిందితుడు అయ్యలరాజుపల్లికి చెందిన అంజనేయ ప్రసాద్‌కు సహకరించిన చంద్రకళ, సింహాద్రిని కూడా అరెస్టు చేశామని రాజంపేట డీఎస్పీ సుధాకర్ తెలిపారు. శుక్రవారం కోడూరు స్టేషన్‌లో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి, వివరాలు వెల్లడించారు. యూట్యూబర్ అయిన నిందితుడు సానుభూతి పొందడానికి వీడియో రిలీజ్ చేశారని తెలిపారు.
News December 14, 2024
రాష్ట్రంలో రాజంపేట టాప్
కోటి సభ్యత్వాలే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తోంది. రూ.100 కడితే రూ.5 లక్షల బీమా ఉండటంతో పలువురు టీడీపీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో నిన్నటి వరకు మొత్తం సభ్యత్వాల సంఖ్య 71 లక్షలు దాటింది. ఇందులో రాజంపేట టాప్‌లో ఉంది. ఆ తర్వాతే సీఎం సొంత నియోజకవర్గం కుప్పం ఉండటం గమనార్హం.