News March 4, 2025

వెయిట్ లిఫ్టింగ్ పోటీల విజేతలకు అభినందనలు

image

అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఏయూ తరఫున పాల్గొని 71 కిలోల విభాగంలో ఎస్.పల్లవికి గోల్డ్ మెడల్, 76 కిలోల విభాగంలో బి.జాన్సీ బ్రాంజ్ మెడల్ సాధించారు. అదేవిధంగా ఖేలో ఇండియా యూనివర్శిటి పోటీల్లో 71 కిలోల విభాగంలో ఎస్.పల్లవికి సిల్వర్ మెడల్, సీహెచ్ శ్రీలక్ష్మికి 87 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. వీరిని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ అభినందించారు.

Similar News

News March 5, 2025

నేడు విశాఖ రానున్న సీఎం చంద్రబాబు

image

విశాఖకు సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం రానున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు రాత్రి 11:40కి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి రామ్ నగర్‌లో టీడీపీ కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. కేంద్ర మంత్రి ఈరోజు రాత్రి 8:40కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు. ఆమెకు హోం మంత్రి అనిత స్వాగతం పలకనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News March 5, 2025

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

మార్చి 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. గురజాడ కళాక్షేత్రం వేదికగా జరుగనున్న ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల తరఫున చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.

News March 5, 2025

విశాఖలో టుడే టాప్ న్యూస్

image

➤ విశాఖలో ఎన్నికల కోడ్ ఎత్తివేత: కలెక్టర్
➤ దివ్యాంగుల పారా స్టేడియం కోసం స్థల పరిశీలన
➤ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు స్టేడియం సిద్ధం
➤ మార్చి 17 నుంచి 134 కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు
➤ నేడు విద్యుత్ ప్రధాన కార్యాలయంలో లైన్‌మ్యాన్ దివస్
 ➤ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా చర్యలు

error: Content is protected !!