News October 25, 2024

వెలిగొండ ప్రాజెక్టుపై BIG UPDATE

image

వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు సచివాలయంలో అధికారులతో సమీక్షించి పూర్తి సమాచారం తనకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా ప్రాజెక్టును ప్రాధాన్యత జాబితాలో చేర్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గత YCP ప్రభుత్వంలో బడ్జెట్‌లో రూ.4,012 కోట్లు కేటాయిస్తే అందులో కేవలం రూ.764 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు.

Similar News

News November 13, 2024

ఒంగోలులో ఫీల్డ్ ఎయిర్ పోర్టు.?

image

ఆంధ్రప్రదేశ్‌లో 6 ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీపై సర్వే మొదలుపెట్టారు. అందులో ప్రకాశం జిల్లా ఒంగోలులో 657 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ప్రకాశం జిల్లాతో పాటు మరో 5చోట్ల ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అధ్యయనం చేయడానికి రూ.2.27 కోట్లు విడుదల చేయనున్నారు.

News November 13, 2024

ప్రకాశం కలెక్టర్‌తో భేటీ అయిన దామచర్ల సత్య

image

ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో ఉన్న కలెక్టరేట్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియాను మంగళవారం సాయంత్రం రాష్ట్ర మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య కలిసి పలు ప్రజా సమస్యలపై చర్చించారు. కొండపి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సత్య కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు సత్య అందజేశారు.

News November 12, 2024

ప్రకాశం: ఒకేరోజు ముగ్గురు పోలీసుల మృతి

image

ప్రకాశం జిల్లాలో సోమవారం విషాద ఘటనలు జరిగాయి. గతంలో నారా భువనేశ్వరికి సపోర్టుగా నిలిచిన హెడ్ కానిస్టేబుల్ <<14584058>>విజయకృష్ణ<<>> గుండెపోటుతో కన్నుమూశారు. మార్కాపురం(M) కొట్టాపల్లికి చెందిన కానిస్టేబుల్ <<14580513>>వేముల మస్తాన్<<>> భార్యతో గొడవపడి ఉరేసుకున్నారు. ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్‌ హెడ్ కానిస్టేబుల్ చలపతిరావు అనారోగ్యానికి గురయ్యారు. HYDకు తరలిస్తుండగా మేదరమెట్ల వద్ద గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.