News October 30, 2024

వెలిగొండ సందర్శనకు బైకులపై వెళ్లిన మంత్రులు

image

వెలుగొండ ప్రాజెక్టు వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు అధికారులు కూటమి మంత్రులు, MLAలు ఇన్‌ఛార్జులు వచ్చారు. ఈ సందర్భంగా.. మంత్రులు నిమ్మల రామానాయుడు, స్వామి, గొట్టిపాటి, MP మాగుంట, MLAలు ఉగ్రా, దామచర్ల, కందుల, ఇన్‌ఛార్జులు గొట్టిపాటి లక్మీ, ఎరిక్షన్ బాబు ద్విచక్ర వాహనాలపై వెలుగొండ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన ఫోటో వైరల్ అవుతుంది.

Similar News

News October 30, 2024

ప్రకాశం జిల్లాలో విషాదం.. ఇద్దరు మృతి?

image

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలో మంగళవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడియం ఆదిలక్ష్మి(42), మల్లవరపు సుబ్బారెడ్డి (55) బర్రెలను మేపడానికి పొలం వెళ్లారు. బర్రెలు నీటిలోకి వెళ్లాయని మూసీ నది దాటుతుండగా నీటి ప్రవాహానికి ఇద్దరు కొట్టుకుపోయారు. ఆదిలక్ష్మి మృతదేహం బుధవారం లభించగా.. గల్లంతైన సుబ్బారెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

News October 30, 2024

ప్రకాశం జిల్లాలో మొత్తం ఓటర్లు ఎంతమందంటే.!

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తాజాగా అధికారులు ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 18,19,566 చేరింది. ఇందులో పురుషుల సంఖ్య 9,06,234 కాగా, మహిళా ఓటర్లు 9,13,218 మంది ఉన్నారు. వీరిలో థర్డ్ జండర్ 114 మంది ఉన్నారు. జిల్లాలో పురుషులకంటే 6,984 మహిళా ఓటర్లే అధికం. జనవరి 6న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.

News October 30, 2024

అధిక రేట్లకు మద్యం అమ్మితే చర్యలు: ఒంగోలు SP

image

MRP కంటే అధిక రేట్లకు మద్యం అమ్మితే చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక రేట్లకు మద్యం అమ్మితే షాపులను సీజ్ చేసి కేసుల నమోదు చేయాలన్నారు. జిల్లాలో బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘా పెట్టాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం కట్టడి చేయాలని అధికారులకు సూచించారు.