News March 6, 2025
వెలుగొండకు చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే.!

సీఎం చంద్రబాబు ఈనెల 8న ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. అంతకు ముందే మార్కాపురంలో మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో CM పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం 12:30 నుంచి <<15657223>>1:30 వరకు నాయకులతో<<>> సమావేశమౌతారు. ఆ తర్వాత మధ్యహ్నం 2 గంటలకు దోర్నాల మండలంలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4:30 వరకు ప్రాజెక్ట్‌ను పరిశీలించి తిరుగుపయనమౌతారు.
Similar News
News March 15, 2026
పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సూచనలు

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. ముఖ్యంగా సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఓఎంఆర్ షీట్‌లోని సబ్జెక్టు కోడ్, రూమ్ నెంబర్ వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలు రాయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
News March 15, 2026
పర్చూరు: గొర్రెల మందపైకి దూసుకెళ్లిన కారు.. 42 గొర్రెలు మృతి

పర్చూరు దేవరపల్లి వద్ద అతివేగంగా వచ్చిన కారు దూసుకెళ్లి 42 గొర్రెలు మృతి చెందగా, 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. తాళ్లూరు, ముండ్లమూరు మండలాల నుంచి వలస వచ్చిన కాపరులకు సుమారు లక్షల్లో నష్టం వాటిల్లింది. రాష్ట్ర సహాయక కార్యదర్శి తిరుపతిరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుపేద కాపరులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
News March 15, 2026
ప్రకాశం: పాలేరు వాగులో మృతదేహం.. దర్యాప్తు ముమ్మరం

జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట సమీపంలోని పాలేరు వాగులో దొరికిన <<19383562>>మృతదేహంపై <<>>పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతుడి ఆనవాళ్ల కోసం సోషల్ మీడియాలో ఫొటోలు ఉంచడంతో పాటు పక్క జిల్లాల పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపినట్లు ఎస్ఐ మహేంద్ర తెలిపారు. ఎవరైనా అదృశ్యమైన వ్యక్తుల వివరాలు ఉంటే తక్షణమే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.


