News March 29, 2025
వెల్దండలో ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహ పరిశీలన

వెల్దండ మండల కేంద్రంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహం నిర్మాణం జరుగుతుంది. శనివారం గద్దర్ విగ్రహ ఏర్పాటు కమిటీ ఆధ్వర్యంలో నాయకులు గద్దర్ విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గద్దర్ విగ్రహ కమిటీ నాయకులు భిక్షపతి, గోపాల్ తదితరులు మాట్లాడుతూ.. విగ్రహం పూర్తయిన వెంటనే నియోజకవర్గ కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రతిష్ఠిస్తామని వారు పేర్కొన్నారు.
Similar News
News November 13, 2025
మహావిష్ణువు పేరును ఎందుకు స్తుతించాలి?

జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం|
స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః||
భారతంలో భీష్ముడు, ధర్మరాజుకు ఈ శ్లోకాన్ని చెప్పారు. ‘జగత్ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణువును వేయి నామాలతో స్తుతించిన పురుషుడికి నిత్యం శుభాలు కలుగుతాయి’ అనేది దీనర్థం. నిరంతరం విష్ణు నామాన్ని స్మరిస్తూ, ఆయన సేవ చేసే వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుందని ఈ శ్లోకం వివరిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 13, 2025
తిరుపతి: 164 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు.!

EC ఆదేశాల మేరకు ప్రత్యేక ఇంటెన్సివ్ పునర్విమర్శ–2025లో భాగంగా 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి 164 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 38 కేంద్రాల ప్రాంతాల మార్పు, 9 పేర్ల మార్పు,164 కొత్త కేంద్రాల ప్రతిపాదనలతో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగిందన్నారు.
News November 13, 2025
తణుకులో సందడి చేసిన సినీ నటి నిధి అగర్వాల్

తణుకు పట్టణానికి గురువారం ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్ వచ్చారు. తణుకులోని పార్వతి సమేత కపర్దేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆమె సందర్శించుకున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందారు. ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మించడంతో తణుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.


