News February 6, 2025

వెల్దండ: ఆరాధ్య మృతిపై కుటుంబ సభ్యుల ఆందోళన

image

వెల్దండ మండలంలోని చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన ఆరాధ్య ఆత్మహత్యకు పాల్పడడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. బాలనగర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆరాధ్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం రేపింది. ఆరాధ్య మృతిపై న్యాయ విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Similar News

News February 6, 2025

ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే?

image

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని మోదీ ఈనెల 24న విడుదల చేయనున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆరోజున బిహార్‌లో పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అదే సమయంలో పీఎం కిసాన్ నిధులను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ పథకం కింద కేంద్రం ఒక్కో రైతుకు ఏడాదికి 3 విడతల్లో ₹2వేల చొప్పున మొత్తం ₹6వేలు అందిస్తోంది. e-KYC పూర్తి చేసిన వారికే ఈ డబ్బులు జమవుతాయి.

News February 6, 2025

చిట్యాల వద్ద రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి

image

చిట్యాల మండలం వెలిమినేడు శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కర్ణాటక రాయచూర్‌ నుంచి విజయవాడకు హినప్ప రాజు (22) తన స్నేహితులతో వెళ్తున్నాడు. బైక్ అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో హినప్ప రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 6, 2025

VZM: ‘క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి’

image

క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారిణి జీవన రాణి సూచించారు. వైద్య శాఖ కార్యాలయంలో జిల్లాలో పీహెచ్సీ, సీహెచ్సీ వైద్యులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాతృ సేవలు, జేఎస్ వై, పీఎం మాతృ సురక్ష అభియాన్, తదితర కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శత శాతం ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

error: Content is protected !!