News February 6, 2025
వెల్దండ: ఆరాధ్య మృతిపై కుటుంబ సభ్యుల ఆందోళన

వెల్దండ మండలంలోని చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన ఆరాధ్య ఆత్మహత్యకు పాల్పడడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. బాలనగర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆరాధ్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం రేపింది. ఆరాధ్య మృతిపై న్యాయ విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Similar News
News March 18, 2025
GOVT జాబ్ కొట్టిన నల్గొండ జిల్లా బిడ్డ

టీజీపీఎస్సీ ఇటీవల వెల్లడించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన పొనుగోటి మాధవరావు కుమారుడు హరీశ్ సత్తా చాటారు. 300 మార్కులకు గాను 199.16 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 121, జోన్ స్థాయిలో 37వ ర్యాంక్ సాధించి వార్డెన్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా హరీశ్‌కు కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.
News March 18, 2025
నల్గొండ: ఎల్ఆర్ఎస్ 25% రిబేట్‌కు స్పందన

రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం ఈనెల 31లోగా ఎల్ఆర్ఎస్ చెల్లించిన వారికి ప్రకటించిన 25% రిబెట్ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ మేరకు సోమవారం నల్గొండ మున్సిపల్ పరిధిలో 4 లబ్ధిదారులు ఎల్ఆర్ఎస్ చెల్లించి 25% రిబేటు పొందారు. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అందజేశారు.
News March 18, 2025
TGPSC ఫలితాల్లో సత్తా చాటిన ‘అయిజ’ యువతి

సోమవారం TGPSC విడుదల చేసిన ఫలితాల్లో అయిజ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన రాణెమ్మ దేవన్న చిన్న కుమార్తె అయిన సునీత గట్టు గురుకులాల్లో చదివి, SC స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుని హాస్టల్ వెల్ఫేర్ ఫలితాల్లో సత్తాచాటిన ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని సునీత తెలిపింది. ఉద్యోగం సాధించినందుకు తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు.