News May 22, 2024

వెల్దండ: రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు

image

పత్తి విత్తనాలు కొనుగోలు చేయడానికి వెళ్లి రోడ్డు <<13291577>>ప్రమాదంలో <<>>చిక్కుకున్న రైతుల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆటోలో మొత్తం 12 మంది రైతులు జడ్చర్ల వెళ్లి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి వెల్దండ మండలం పడమటి తండాకు పయనమయ్యారు. మంగళవారం రాత్రి వెల్దండ గేటు వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటోను అతి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఏడుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

Similar News

News February 28, 2026

జడ్చర్ల: పుట్టెడు దుఃఖంలో ఆ కుటుంబం.. దొంగల నిలువు దోపిడీ

image

జడ్చర్ల మండలం మల్లేబోయిన్‌పల్లికి చెందిన లక్ష్మి భర్త ఇటీవల చనిపోవడంతో దేవుని వద్ద నిద్ర చేసేందుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ. లక్ష నగదు, 8 తులాల బంగారం, కిలో వెండి వస్తువులను ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఇంటి పెద్ద మృతితో దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఈ చోరీ తీరని నష్టాన్ని మిగిల్చింది. చోరీపై పోలీసులు విచారణ చేపట్టారు.

News February 28, 2026

MBNR: రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత: ఎస్పీ జానకి

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యతే కాదని, ప్రతి పౌరుడు నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మావతి, సీఐలు శ్రీనివాస్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

News February 27, 2026

పాలమూరు: హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి

image

TGSC స్టడీ సర్కిల్‌లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్ నగర్‌లోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మార్చి1న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.