News March 10, 2025

వెల్దుర్తి: ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి

image

ఆగి ఉన్న ట్రాక్టర్‌ని ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో తండ్రితో పాటు చిన్నారి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి వెల్దుర్తి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది. మండల పరిధిలోని మిట్టమీద పల్లె గ్రామానికి చెందిన పల్లా శ్రీను(30), రూప (3) మాచర్ల నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా వెల్దుర్తి పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. సంఘటనా స్థలంలోనే ఇరువురు మృతి చెందారు.

Similar News

News December 5, 2025

కోతులను పట్టిస్తేనే.. సర్పంచ్‌గా గెలిపిస్తాం: మాదారం గ్రామస్థులు

image

భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలోని మాదారం గ్రామ ప్రజలు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా మారి, పంటలను నాశనం చేస్తుండటంతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు కోతుల సమస్యను పరిష్కరించే అభ్యర్థినే తాము గెలిపిస్తామని గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు స్పష్టం చేశారు.

News December 5, 2025

RR: ఎన్నికలకు ఎంత ఖర్చు చేయాలంటే!

image

కొత్తూరు MPDO కార్యాలయంలో ఎన్నికల అధికారులు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు.
☛సర్పంచ్ అభ్యర్థి గరిష్ఠంగా ₹1,50,000 మాత్రమే ఖర్చు చేయాలి
☛వార్డు మెంబర్ ₹50,000 మించరాదు
☛బ్యాంకు/ UPI ద్వారానే చెల్లించాలి
☛రోజువారీగా ఖర్చుల రికార్డు, రసీదులు తప్పనిసరి
☛లిమిట్ దాటితే అభ్యర్థిత్వం రద్దు
ఖర్చులన్నీ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేస్తుందని నియమాలు తప్పక పాటించాలని అధికారులు సూచించారు.

News December 5, 2025

రాజమండ్రి: 5000 కెమెరాలు..17 డ్రోన్‌లతో నిఘా

image

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందాలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.