News July 1, 2024
వెల్దుర్తి: వైన్స్కు కన్నం.. నగదు చోరీ

వెల్దుర్తి మండల కేంద్రంలోని తిరుమల వైన్స్లో సుమారు రూ. 55 వేల నగదు చోరీ జరిగింది. రాత్రి సమయంలో గుర్తుతెలియని దొంగలు వైన్స్ వెనుక వైపు కన్నం వేసి వైన్ షాపులో ఉన్న నగదు చోరీ చూశారు. అలాగే వెల్దుర్తిలో దంతాన్పల్లికి చెందిన శేఖర్ కిరాణా దుకాణం, చందుకు చెందిన మొబైల్ షాప్లో చోరీ చేసేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 17, 2025
మెదక్: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్ అమీర్పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం PLAN INTERNATIONAL ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
News September 17, 2025
మెదక్: ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస రావు జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి, పట్టుదలతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సువిశాల భారతదేశంలో విలీనమై ప్రజాస్వామ్య దశలోకి ప్రవేశించిందని వివరించారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజల పాలన వైపు వచ్చిన ఈ పరివర్తన ప్రజాస్వామ్య శక్తికి ప్రతీక అన్నారు.
News September 17, 2025
జాతీయ స్థాయిలో మెదక్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు రెంజుకి షోటోకాన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ మాస్టర్ నగేశ్ తెలిపారు. ముంబైలో జాతీయస్థాయి కరాటే పోటీలు జరగగా మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థులు బ్లాక్ బెల్ట్ విభాగంలో అండర్ -13 స్వరూప్ సింగ్, అండర్-16 అబ్దుల్లా,
అండర్-17లో సూరజ్ గోల్డ్ మెడల్స్తో పాటు ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు.