News March 9, 2025
వెల్లలచెరువులో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామం సమీప రైల్వే ట్రాకు వద్ద ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మరణించాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు చర్యలు చేపట్టనున్నారని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Similar News
News November 18, 2025
ALERT: ఫోన్ IMEI నంబర్ మారుస్తున్నారా?

ఫోన్లలోని 15 అంకెల IMEI నంబర్ను మార్చడం నాన్ బెయిలబుల్ నేరం కిందికి వస్తుందని టెలికం శాఖ హెచ్చరించింది. మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తయారీదారులు, బ్రాండ్ ఓనర్లు, ఇంపోర్టర్లు, సెల్లర్లకు అడ్వైజరీ జారీ చేసింది. నిబంధనలకు లోబడి ఉండాలని సూచించింది. ఐఎంఈఐని మార్చేందుకు ఉపయోగించే పరికరాలను కలిగి ఉండటం కూడా నేరమేనని వార్నింగ్ ఇచ్చింది.

గద్వాల: హత్యాయత్నం కేసులో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

అటెంప్ట్ మర్డర్ (హత్యాయత్నం) కేసులో నిందితులైన కుర్వ గోకారి, కాశన్నలకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించారు. నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికీ రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రాజోలి మండలం బుడమోర్సు గ్రామానికి చెందిన కుర్వ లక్ష్మీనారాయణ 06/03/2018న వారిపై ఫిర్యాదు చేశారు.