News March 9, 2025
వెల్లలచెరువులో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామం సమీప రైల్వే ట్రాకు వద్ద ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మరణించాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు చర్యలు చేపట్టనున్నారని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Similar News
News March 21, 2025
శాంతిభద్రతలపై హోం మంత్రి సమీక్ష

విజయవాడ డీజీపీ కార్యాలయంలో శుక్రవారం హోం మంత్రి వంగలపూడి అనిత శాంతి భద్రతలపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ హరీష్ గుప్తాతో కలిసి జిల్లాల ఎస్పీలతో వివిధ అంశాలపై సమీక్షించానన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటులో పురోగతిని జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలపై నేరాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News March 21, 2025
మానాపురం ROB పనులపై కలెక్టర్ సీరియస్

మానాపురం ROB నిర్మాణం ఆలస్యం అయినందున కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన ఛాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. నోటీసు అందిన రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని, లేనిచో చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పనుల ఆలస్యం వలన ట్రాఫిక్ సమస్యతో పాటు పబ్లిక్‌కు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు.
News March 21, 2025
ఎంపీ వద్దిరాజుకు రాష్ట్రపతి ముర్ము ఆహ్వానం

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు తదితర ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం ఉదయం అల్పాహారం తీసుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులను ఆహ్వానించి అల్పాహార విందునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర రాజ్యసభలో తన సహచర ఎంపీలతో పాటు రాష్ట్రపతి ముర్మును కలిసి పలు అంశాలపై మాట్లాడారు.