News April 15, 2025

‘వెళ్లొస్తాం.. సళేశ్వరం లింగమయ్యా..!’

image

నల్లమలలోని లోతట్టు ప్రాంతం సళేశ్వర క్షేత్రంలో వెలసిన లింగమయ్య ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. మూడు రోజులపాటు నల్లమల కొండలు జనసంద్రంతో కిక్కిరిసి కనిపించాయి. చివరిరోజు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వాహనాలు అడవిలోకి వెళ్లకుండా అటవీ శాఖ నిలిపివేసింది. చివరిరోజు వెళ్లొస్తాం.. లింగమయ్యా అంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.

Similar News

News October 30, 2025

రేపు అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం!

image

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12.15గంటలకు రాజ్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులకు ఆహ్వాన లేఖలు అందినట్లు సమాచారం.

News October 30, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. GVMCకి రూ.8.07 కోట్ల నష్టం!

image

మెుంథా తుఫాన్ కారణంగా EPDCL పరిధిలోని 11 సర్కిళ్లలో రూ.10.47 కోట్ల నష్టం సంభవించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రధానంగా కోనసీమ, కాకినాడ, పశ్చి గోదావరి సర్కిళ్లలో ఎక్కువ నష్టం జరిగినట్టు పేర్కొంది. తుఫాన్ కారణంగా GVMC పరిధిలో రూ.8.07 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. రోడ్లు, డ్రైనేజీ ధ్వంసం, తీరప్రాంతంలో కోత గురవడం వంటివి జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఇచ్చారు.

News October 30, 2025

అది వారి ‘రేటు జాబితా’.. ప్రతిపక్షాల మ్యానిఫెస్టోపై మోదీ సెటైర్లు

image

బిహార్‌లో ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్‌ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. ‘జంగిల్ రాజ్ నాయకులు ప్రజలను నిరంతరం మోసం చేస్తున్నారు. మ్యానిఫెస్టో పేరుతో ఆర్జేడీ, కాంగ్రెస్ తమ రేటు జాబితాను రివీల్ చేశాయి. వారి ప్రతి డిక్లరేషన్ వెనుక ప్రధాన ఉద్దేశం అవినీతి, దోపిడీ’ అని ఆరోపించారు. బిహార్‌ను RJD, కాంగ్రెస్ డెవలప్ చేయలేవని, గతంలో తమ పాలనలో ప్రజలను మోసం చేశాయని అన్నారు.