News November 19, 2024
వేంపల్లి: గుర్తుపడితే సమాచారం ఇవ్వండి
గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందిన ఘటన గండిలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ఏడు గంటలకు పంచముఖ ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. గమనించిన పోలీసు సిబ్బంది అంబులెన్స్ ద్వారా వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆర్కే వ్యాలీ ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. మృతిరాలికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని ఎస్సై తెలిపారు.
Similar News
News November 23, 2024
పోరుమామిళ్ల వాసికి 20 ఏళ్ల జైలు శిక్ష
నెల్లూరు కోర్టులో పోరుమామిళ్ల వాసి పప్పర్తి సుబ్బరాయుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. సుబ్బరాయుడు 2020 మేలో బాలిక (14), ఆమె చిన్నాన్నను లారీలో ఎక్కించుకున్నాడు. అతడిని ఓ హోటల్ దగ్గర దింపి, కృష్ణపట్నం హైవేపై లారీని ఆపి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక చిన్నాన్న ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.22వేల జరిమానా కోర్టు విధించింది.
News November 23, 2024
నిమ్మ పంటను పరిశీలించిన కడప జిల్లా కలెక్టర్
పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కలసపాడు తహశీల్దారు కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పనులపై అరా తీశారు. అనంతరం తెల్లపాడు గ్రామపంచాయతీ దూలంవారిపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద లబ్ధి పొందిన రైతు పొలంలో పర్యటించారు. కొమ్ముల హరి అనే రైతు సాగు చేసిన నిమ్మ పంటను సూసి సంతోషించారు.
News November 22, 2024
కడప: అధికారులు ప్రాథమిక విధులు విస్మరించరాదు.!
రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ భూముల కేటాయింపు విషయంలో ప్రాథమిక విధులను విస్మరించకుండా SOP ప్రకారం బాధ్యతలను నిర్వహించాలని, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ విషయాలపై శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. భూముల రీ సర్వే, భూ రికార్డుల స్వచ్చీకరణ, ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్, భూసేకరణ రెవెన్యూ శాఖలో పెండింగ్ అంశాలు తదితర అంశాలపై చర్చించారు.