News November 19, 2024
వేంపల్లి: గుర్తుపడితే సమాచారం ఇవ్వండి

గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందిన ఘటన గండిలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ఏడు గంటలకు పంచముఖ ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. గమనించిన పోలీసు సిబ్బంది అంబులెన్స్ ద్వారా వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆర్కే వ్యాలీ ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. మృతిరాలికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని ఎస్సై తెలిపారు.
Similar News
News March 9, 2026
బి.మఠం: అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డా సేఫ్

అంబులెన్స్‌లో మహిళ ప్రసవించిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. బి.మఠం మండలం పలుగురాళ్లపల్లికి చెందిన గర్భిణి అపర్ణను పోరుమామిళ్ల నుంచి ప్రొద్దుటూరు ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే అపర్ణ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహాలక్ష్మి, పైలట్ వెంకటేశ్వర్లు తెలిపారు. అంబులెన్స్ సిబ్బందిని పలువురు అభినందించారు.
News March 9, 2026
VRకు కడప జిల్లా కానిస్టేబుల్.!

కడప జిల్లా కలసపాడు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కిషోర్‌ను VRకు పంపినట్లు SI సుహాన్ తెలిపారు. కిషోర్ కలసపాడు PSలో కోర్ట్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధులపట్ల నిర్లక్ష్యంగా ఉండడంతో కడప జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో విఆర్‌కు పంపినట్లు కలసపాడు ఎస్సై వివరించారు.
News March 9, 2026
కడప: ‘ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి’

మహిళా సాధికారతలో భాగంగా ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ మహిళలకు పిలుపునిచ్చారు. ఆదివారం కడపలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. మహిళా సాధికారిత కోసం మొదటి సారిగా 1995-96లో CM చంద్రబాబు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో 40వేల సంఘాలు ఉన్నాయన్నారు.


