News September 29, 2024

వేంపల్లి: యూట్యూబర్‌పై కేసు నమోదు

image

వేంపల్లెలో ఓ యూట్యూబ్ ఛానెల్ అధినేతపై కేసు నమోదు చేశారు. తన ఛానెల్లో పని చేస్తున్న యువతిని వేధించిన కేసులో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు CI సురేష్ రెడ్డి తెలిపారు. ‘అతడి ఛానెల్లో యాంకర్‌గా పనిచేసే సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడ మానేసినా వేధింపులు అపలేదు. తాను అతడి మాటలు వినలేదని తన ఆఫీసు నుంచి నా సర్టిఫికేట్లు తీసుకెళ్లానని అబద్దపు కేసు పెట్టారు’ అని ఫిర్యాదులో తెలిపింది.

Similar News

News October 9, 2024

గొప్ప మనసును చాటుకున్న కడప జిల్లా కలెక్టర్

image

ఫిర్యాదుల పట్ల తక్షణ సహాయ సహకారాలు అందిస్తూ కడప కలెక్టర్ శివశంకర్ గొప్ప మనసును చాటుకుంటున్నారు. దువ్వూరు మండలం క్రిష్ణంపల్లికి చెందిన పి. భాగ్యలక్ష్మి తాను ఒంటరి మహిళనని, తనకు సపరేటుగా రేషన్ కార్డు సదుపాయం కల్పించాలని, రేషన్ కోటా తీసుకోలేక పోతున్నానని కలెక్టర్‌కు విన్నవించారు. రేషన్ కార్డు సపరేషన్ ఆప్షన్ లేదని, అంతవరకు తన సొంత ఖర్చుతో బియ్యం, సరుకులు అందిస్తామని చెప్పి వెంటనే ఆమెకు అందించారు.

News October 9, 2024

కాక పుట్టిస్తున్న జమ్మలమడుగు రాజకీయం

image

రెండు రోజుల నుంచి జమ్మలమడుగు రాజకీయం వేడి వాడిగా సాగుతోంది. సుధీర్ రెడ్డి వైడ్ బాల్, MLC రామసుబ్బారెడ్డి నో బాల్ అని MLA ఆదినారాయణ రెడ్డి కామెంట్ చేశారు. దీనికి ఎమ్మెల్యే ఆది అధికారం ఉంటేనే పులి, అధికారం లేకపోతే పిల్లిలా ఉంటాడంటూ రామసుబ్బారెడ్డి కౌంటర్ ఎటాక్ చేశారు. వీళ్ల వ్యాఖ్యలు చూస్తుంటే 2009 ఎన్నికలు గుర్తుకువస్తున్నాయని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. వీళ్ల వ్యాఖ్యలపై మీ కామెంట్..

News October 8, 2024

సంక్రాంతిలోగా పనులు పూర్తి చేయాలి: కడప కలెక్టర్

image

కడప జిల్లాల్లో గ్రామ సభల్లో ఆమోదిందించిన పల్లె ప్రగతికి ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులను వచ్చే సంక్రాంతి లోపు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ శివ శంకర్ ఆదేశించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సభలు, పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు తదితర అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు. ఈ నెల 14వ తేది నుంచి 20వ తేది వరకు పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.