News August 3, 2024
వేంపల్లి: IIIT కౌన్సెలింగ్ లిస్ట్ విడుదల.. టైమింగ్స్ ఇవే.!
AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024-25 విద్యా సంవత్సర ప్రవేశాలకు తొలి విడత కౌన్సెలింగ్ లో 3396 సీట్లు భర్తీ అయ్యాయి. తొలి విడతలో అడ్మిషన్లు పొంది క్యాంపస్ మార్పుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు లిస్టు, మిగిలిన సీట్ల భర్తీకి ఎంపిక చేసిన విద్యార్థుల సెకండ్ లిస్ట్ నేటి మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. కాగా లిస్టులను ఆర్జీయూకేటీ వెబ్సైట్ ‘www.rgukt.in’లో పొందుపరుస్తారని అధికారులు తెలిపారు.
Similar News
News September 14, 2024
ఎర్రగుంట్ల: తండ్రి తాగొద్దని చెప్పినందుకు కొడుకు సూసైడ్
ఎర్రగుంట్లలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన చింతకుంట వెంకట్(18) రోజూ తాగి ఇంటికి వస్తుంటాడు. తన తండ్రి మందు తాగొద్దని మందలించేవాడని తెలిపారు. దీంతో శనివారం ఉదయం వెంకట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
News September 14, 2024
ప్రొద్దుటూరు: ‘మా పాప మృతికి కారణం వైద్యులే’
ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి విషాదం నెలకొంది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చాపాడు మండలం నక్కలదిన్నెకు చెందిన బాలఎల్లయ్య, సుమలతల కుమార్తె జసికాశ్రీ చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. దీనికి కారణం చిన్నారి ఊపిరితిత్తిలో నిమ్ము ఎక్కువ అవ్వడమేనని వైద్యులు తెలిపారు. అయితే తమ పాప మృతికి కారణం వైద్యులే అని చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు.
News September 14, 2024
కడప: ‘17 నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు’
అక్టోబర్ 2న ‘స్వచ్ఛ భారత్ దివస్’ నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈనెల 17 నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు ‘స్వచ్ఛతా హీ సేవా’ పేరుతో, కార్యక్రమాలు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో మండలాల అధికారులతో వీసీ ద్వారా శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు జిల్లా “స్వచ్ఛతా హీ సేవా” కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.