News February 26, 2025
వేంపాడులో లారీ ఢీకొని కాకినాడ జిల్లా వాసి మృతి

నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందినట్లు ఎస్సై సన్నిబాబు మంగళవారం తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన చిక్కాల శ్యాంప్రసాద్ (29) వేంపాడు వద్ద ఫ్యాబ్రిక్స్ వర్క్స్ షాపులో పని చేస్తున్నాడు. స్నేహితుడితో కలిసి బైక్‌పై టోల్ ప్లాజా వద్ద టీపాయింట్‌కు వెళుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్యాం ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News February 24, 2026
రైతులకు 392 విద్యుత్ కనెక్షన్లు జారీ: హన్మకొండ ఎస్ఈ

రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులు గరిష్ట స్థాయిలో మంజూరు చేసినట్లు ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్ఈ మధుసూదన్ తెలిపారు. వరంగల్ పరిధిలో డిసెంబర్ నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 392 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. పంటల కోత కాలం ముగియడంతో రైతులకు త్వరతగతిన కనెక్షన్లు జారీ చేస్తున్నామన్నారు.
News February 24, 2026
జేఈఈ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు

జేఈఈ మెయిన్స్ సెషన్-1 పేపర్-2లో తెలుగు తేజాలు మెరిశాయి. పేపర్ 2ఏలో TGకి చెందిన శ్రేయస్ రెడ్డి 99.99 పర్సంటైల్.. ఏపీ నుంచి శరణ్య అశ్విని 99.95 స్కోర్ సాధించారు. పేపర్ 2బీలో TG నుంచి నాగ ప్రద్యుమ్న రెడ్డి 99.98, ఏపీలో హర్షాదిత్య, ఈశ్వర్ రాజ్, భీమ తులిప్ 99.95 స్కోర్ చేశారు. కేరళకు చెందిన సూర్యతేజస్, గౌరీశంకర్ మాత్రమే 100 పర్సంటైల్ సాధించారు. కాగా సెషన్-2 రిజిస్ట్రేషన్‌కు రేపే లాస్ట్ డేట్.
News February 24, 2026
NZB: అరైవ్ అలైవ్ వారోత్సవాలు.. విద్యార్థులకు అవగాహన

రోడ్డు ప్రమాదాల నివారణలో ముందస్తు అవగాహనే అత్యంత కీలకమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. అలైవ్ అరైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులు అంబాసిడర్‌గా ఉండి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


