News April 8, 2025
వేటపాలెంలో కానిస్టేబుల్ సూసైడ్.. కారణమిదే..!

వేటపాలెంలోని దేశాయి పేటకు చెందిన <<16024172>>కానిస్టేబుల్ రమేశ్ ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగానే తాను చనిపోయినట్లు తెలుస్తోంది. కారంచేడు మహిళతో 2000లో వివాహం అవ్వగా.. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య దూరంగా ఉంటూ భర్తపై కోర్టులో కేసు వేసింది. సోమవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా అదే రోజు పెద్ద కుమార్తె పుట్టినరోజు.
Similar News
News December 5, 2025
MBNR: స్థానిక ఎన్నికలు.. భారీగా నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ రెండో రోజున నామినేషన్లు భారీగా దాఖలు అయ్యాయి. అత్యధికంగా జడ్చర్ల మండలం నుంచి 81 నామినేషన్లు వచ్చాయి. బాలానగర్ మండలంలో 68 నామినేషన్లు, భూత్పూర్ మండలంలో 44 నామినేషన్లు, మూసాపేట మండలంలో 19 నామినేషన్లు, అడ్డాకులలో 37 నామినేషన్లు దాఖలయ్యాయి.
News December 5, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} మూడో రోజు కొనసాగుతున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మంలో ఎమ్మెల్సీ మధుసూదన్ పర్యటన
News December 5, 2025
గచ్చిబౌలి శాంతిసరోవర్లో ‘సండే ఈవినింగ్ టాక్’

బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతిసరోవర్ క్యాంపస్లో ఆదివారం ‘సండే ఈవినింగ్ టాక్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సా.6:30 నుంచి రాత్రి 8 గం. వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ‘విలువ వినోదం’ (వాల్యూటెయిన్మెంట్) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విలువల కార్యకలాపాలు, దైవిక గీతాలాపన, ధ్యాన అనుభవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.


