News April 8, 2025
వేటపాలెంలో కానిస్టేబుల్ సూసైడ్..ఒంటరైన తండ్రి

వేటపాలెంలోని దేశాయి పేటకు చెందిన <<16024172>>కానిస్టేబుల్ రమేశ్ ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతని తండ్రి దిక్కులేని అనాథగా మిగిలిపోయాడు. మృతుని అక్క, తల్లి గతంలోనే చనిపోయారు. ఇప్పుడు కొడుకు కూడా చనిపోవడంతో కుటుంబంలో తండ్రి ఒంటరిగా మిగిలిపోయాడు. వృద్ధాప్యంలో తోడులేకుండా పోవడంతో ఆయన బాధ చూపరులను కంటతడి పెట్టించింది.
Similar News
News November 7, 2025
HYD: ట్రబుల్ షూటర్ వచ్చేస్తున్నారు!

పితృవియోగంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ మంత్రి హరీశ్రావు మళ్లీ యుద్ధరంగంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు దగ్గర పడుతుండడంతో, ట్రబుల్ షూటర్గా ఆయన ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. BRS జైత్రయాత్రను జూబ్లీహిల్స్ నుంచే మొదలు పెట్టేందుకు, హరీశ్ వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
News November 7, 2025
NRPT: నవంబర్ 14న ‘చదువుల పండగ’: కలెక్టర్

నవంబర్ 14న జిల్లా స్థాయిలో ‘చదువుల పండగ-కలలు కనేద్దాం, నేర్చుకుందాం, సాధిద్దాం!’ అనే నినాదంతో మహా వేడుక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నేర్చుకునే ఉత్సాహం నింపే లక్ష్యంతో ఈ పండుగను నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు.
News November 7, 2025
సిద్ధవటం: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో కౌలు రైతు వెంకట నరసారెడ్డి(60) ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లికి చెందిన వెంకటనరసారెడ్డికి పంటలు చేతికి అందక రూ.40 లక్షల అప్పులయ్యాయి. ఆ బాధతో పురుగు మందు తాగి APSP 11వ బెటాలియన్ వెనుకవైపు ఉన్న పొలాల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


