News March 9, 2025
వేటపాలెం: గుర్తుతెలియని మృతదేహం కలకలం

వేటపాలెం మండలంలో శనివారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మండల పరిధిలోని కొత్తరెడ్డిపాలెం- రొయ్యల చెరువు పక్కన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News September 15, 2025
స్వధార్ హోమ్‌లో మహిళ ఆత్మహత్య: SI

విజయనగరంలోని BC కాలనీ మహిళా ప్రాంగణంలో ఉన్న స్వధార్ హోమ్‌లో భారతి (21) ఆత్మహత్య చేసుకుందని రూరల్ SI అశోక్ కుమార్ తెలిపారు. SI వివరాలు ప్రకారం.. అబూజా (17)ని భారతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొత్తవలసలోని ఓ చోరి కేసులో ఈ నెల 12న అబూజాని అరెస్ట్ చేసి బాల నేరస్థుల హోంకు తరలించారు. ప్రేమ వివాహం కారణంగా వీరిని కుటుంబ సభ్యులు దూరంగా ఉంచడంతో ఆమెను స్వధార్ హోమ్‌లో ఉంచారు. అక్కడ ఆమె అత్మహత్య చేసుకుంది.
News September 15, 2025
CSIRలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

<
News September 15, 2025
తిరుపతిలో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తా: SP

శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంచడమే పోలీసుల ధ్యేయమని, 24 గంటల పాటు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘డ్రగ్స్ ఫ్రీ తిరుపతి’ తన లక్ష్యం అన్నారు.