News April 16, 2025

వేటపాలెం: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

image

విద్యుత్ వైరు తగిలి ఒక వ్యక్తి చనిపోయిన ఘటన వేటపాలెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ M. వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. అనుమల్లి పేటకు చెందిన వ్యక్తి ఇంటికి వెళ్లే క్రమంలో వర్షం కారణంగా తెగిపడిపోయిన వైరు అడ్డంగా ఉండడాన్ని గమనించి దాన్ని తప్పించే క్రమంలో పట్టుకున్నాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి బొడ్డు మోహన్ రావు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Similar News

News November 24, 2025

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం: ఎస్పీ

image

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ బి.రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. అమలాపురంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 26 ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించిన ఎస్పీ.. సంబంధిత అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో విచారణ జరిపి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు.

News November 24, 2025

నిర్మల్: డిసెంబర్ 5లోపు పరీక్ష ఫీజులు చెల్లించాలి

image

రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించే టైలరింగ్, డ్రాయింగ్ పరీక్షలకు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ డిసెంబర్ 5 అని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) భోజన్న తెలిపారు. ఈ పరీక్షలు జనవరి, ఫిబ్రవరి 2026లో నిర్వహించబడతాయి. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్‌కు రూ.100, హయ్యర్ గ్రేడ్‌కు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీకి రూ.100, హయ్యర్ గ్రేడ్‌కు రూ.200 చొప్పున చెల్లించాలన్నారు.

News November 24, 2025

నల్గొండ: మహిళా ఓట్ల కోసం వ్యూహం..!

image

అధికార కాంగ్రెస్ గ్రామ పంచాయతీల్లో ఓట్లు రాబట్టేందుకు మహిళలపై ఫోకస్ చేసింది. చాలా వేగంగా మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. NLG జిల్లాలో 29,754 గ్రూపుల్లో, 2,97,054 సభ్యులు, SRPT జిల్లాలో 17,611 గ్రూపుల్లో 1,91,576 సభ్యులు, BNG జిల్లాలో 39,871 గ్రూపులకు 1,59,482 సభ్యులకు చీరలు పంపిణీ చేస్తున్నారు. వీరితో పాటుగా రేషన్ కార్డున్న వారికి సైతం అందించి ఓట్లను సంపాదించాలని ఆలోచనలో ఉన్నారు.